ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, మార్టేరు ప్రాంతీయ వరి పరిశోధన స్థానం నెగ్గిపూడిలో ఏప్రిల్ 7, 2026న కిసాన్ మేళా జరగనుంది. ఈ కార్యక్రమానికి వ్యవసాయశాఖ మంత్రి కింజరపు అచ్చంనాయుడు ముఖ్యఅతిథిగా విచ్చేస్తున్నారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు జరిగే ఈ మేళాలో మంత్రి అచ్చంనాయుడు, స్థానిక ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, మంత్రి నిమ్మల రామానాయుడు, కలెక్టర్ చదలవాడ నాగరాణి లతో కలసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. గోదావరి మండలం వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.