పెనుగొండలో మెగా జాబ్ మేళా: 1500 ఉద్యోగాలు సిద్ధం

పెనుగొండ ప్రాంత నిరుద్యోగ యువతకు శుభవార్త. ఈ నెల 5వ తేదీన వాసవి పెనుగొండ ఎస్వీకేపీ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో భారీ మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ వైవీవీ అప్పారావు తెలిపారు. ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, నేషనల్ కెరీర్ సర్వీస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మేళాలో 16 కంపెనీలు పాల్గొని, సుమారు 1500 ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. 18 నుంచి 35 ఏళ్ల వయస్సు కలిగి, 10వ తరగతి పైబడిన విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు పాల్గొనాలని సూచించారు.

సంబంధిత పోస్ట్