బ్రాహ్మణ చెరువులో ముమ్మరంగా ఎన్సీడీ సర్వే

పెనుమంట్ర మండలం బ్రాహ్మణ చెరువులో గురువారం ఏఎన్ఎం లక్ష్మి, ఆశా సిబ్బంది ఆధ్వర్యంలో ఎన్సీడీ సర్వే నిర్వహించారు. గ్రామంలోని ప్రజలకు ఆరోగ్య సర్వే చేసి, సీజనల్ వ్యాధులు, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అనారోగ్య లక్షణాలుంటే సంప్రదించాలని ఏఎన్ఎం లక్ష్మి సూచించారు. ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్