పెనుగొండ పట్టణంలోని రోడ్ల వెంట ఉన్న విద్యుత్, టెలిఫోన్ స్తంభాలకు ప్రైవేట్ సంస్థల కేబుల్ వైర్లు కట్టలుగా కట్టేసి వదిలేయడం వల్ల అవి చెదురుగా వేలాడుతున్నాయి. ద్విచక్ర వాహనాల హ్యాండిల్స్‌కు చుట్టుకుని ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. స్థానిక పోలీసులు, పంచాయతీ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.