పెనుగొండ పంచాయతీ పరిధిలోని వివిధ ప్రాంతాలలో పేరుకుపోయిన చెత్తను పూర్తిగా తొలగించకుండా పెనుగొండ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు ఆ చెత్తకు నిప్పు పెట్టడంతో తీవ్ర కలుషితమైన పొగ వ్యాపిస్తోంది. దీంతో ఆ ప్రాంతాల్లో నివసించేవారు, వాహనదారులు, పాదచారులు ఊపిరి ఆడక తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. పెనుగొండ పంచాయితీ అధికారులు స్పందించి రోడ్లపై పేరుకుపోయిన చెత్త పూర్తిగా తొలగించి, చెత్తకు నిప్పు పెట్టకుండా, ప్రజలు అనారోగ్యాల పాలు కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.