పెనుగొండ: నిలకడగా వశిష్ట గోదావరి వరద ప్రవాహం

పెనుగొండ: వశిష్ట గోదావరి నిలకడగా ప్రవహిస్తోంది. రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన వరద సోమవారం స్థిరంగా ఉంది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆదివారం రాత్రి నుంచి గోదావరి వరద తగ్గుముఖం పట్టిందని, ఇప్పట్లో పెరిగే అవకాశాలు లేవని అంచనా వేస్తున్నారు. లంక గ్రామాల్లోని కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై బురద చేయడంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

సంబంధిత పోస్ట్