పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామములో కొలువైన శ్రీ పార్వతీ సమేత శ్రీ నందీశ్వర స్వామి ఆలయంలోని శ్రీ పార్వతి అమ్మవారిని శాకాంబరి అన్నపూర్ణాదేవిగా అలంకరించారు. శుక్రవారం ఆషాడ మాసం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు తోలేటి దుర్గా వరప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బడేటి గణేష్ దంపతులు పార్వతి అమ్మవారికి ఆషాడమాసం సారి సమర్పించారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు.