పెనుగొండ: ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు

పెనుగొండ పట్టణంలో మరియు మండల వ్యాప్తంగా గత మూడు రోజులుగా తీవ్రమైన ఎండ ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. శనివారం, ఆదివారం మధ్యాహ్నం నుంచి ఉక్క పోత మరి ఎక్కువగా ఉంది. దీంతో చిన్నారులు, వృద్ధులు అల్లాడారు. తీవ్రమైన ఎండతో పెనుగొండ, దొంగరావిపాలెం, వడలి, సిద్ధాంతం, మాటేరు, నెగ్గిపూడి తదితర ప్రాంతాల్లో నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారులు నిర్మాణస్యంగా మారాయి. గత వారం భారీ వర్షాలు కురవగా వాతావరణం చల్లబడింది.

సంబంధిత పోస్ట్