పెనుగొండ: భక్తిశ్రద్ధలతో సంకటహర చతుర్థి పూజలు

ఆషాడ బహుళ చతుర్థి సందర్భంగా గ్రామపంచాయతీ వద్ద గల శ్రీ సంపత్ వినాయకుని ఆలయం నందు సంకటహర చతుర్థి పూజలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. స్వామివారికి పాలు, తేనె, చందనం, విభూధి, సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు, గరిక అర్చనలు చేశారు. సంకటహర చతుర్థి హోమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్