పెనుమంట్ర మండలం ఆలమూరు గ్రామంలో స్మశాన వాటిక కేటాయించకపోవడం దారుణమని మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజ్ అన్నారు. గతంలో స్మశాన వాటిక కోసం రోడ్డుపై ధర్నా చేసినా ఫలితం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, ఆచంట నియోజకవర్గ అధ్యక్షులు కుసుమే వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం మరోసారి ధర్నా చేపట్టారు.