ఏప్రిల్ 4న పెనుమంట్ర మండలం మార్టేరులోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థలో 'మారుతున్న వాతావరణ, వాణిజ్య పరిస్థితులు - సుస్థిర వరి వ్యవసాయం' అనే అంశంపై కిసాన్ మేళా జరగనుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు అచ్చెన్నాయుడు, రామానాయుడు, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణలు పాల్గొని ప్రసంగించనున్నారని సంస్థ సహా సంచాలకులు టి. శ్రీనివాస్ తెలిపారు. వాతావరణ మార్పులు, వాణిజ్య పరిస్థితులకు అనుగుణంగా సుస్థిర వరి సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించడమే ఈ మేళా ముఖ్య ఉద్దేశ్యం.