పెనుమంట్ర మండలం బ్రాహ్మణచెరువు గ్రామంలో మంగళవారం ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కార్యక్రమం ముమ్మరంగా నిర్వహించారు. ఏఎన్ఎం లక్ష్మి ఆధ్వర్యంలో గ్రామంలో ఇంటింటికి వెళ్ళిన ఆరోగ్య సిబ్బంది 70 ఏళ్లు దాటిన వృద్ధులకు పీఎంజేఏవై కోసం ఈకేవైసీ చేయించారు. పీఎంజేఏవైలో నమోదు చేసుకుని ఆరోగ్య భద్రత పొందాలని ఏఎన్ఎం సూచించారు.