నేడు పెనుమంట్ర మండలంలో పవర్ కట్

పెనుమంట్ర మండలం మార్టేరులో విద్యుత్ లైన్ల వద్ద చెట్టు కొమ్మల తొలగింపు పనుల దృష్ట్యా శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు విద్యుత్ ఉండదని విద్యుత్ సిబ్బంది తెలిపారు. కావున విద్యుత్తు వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్