పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా గురువారం రాత్రి 7 గంటల నుండి 11 గంటల వరకు బాబా వారి పల్లకీసేవ వైభవంగా నిర్వహించారు. పల్లకి మెయిన్ రోడ్ గుండా సాగగా, భక్తులు భజనలతో పరవశించిపోయారు. పట్టణంలో భక్తిశ్రద్ధలతో పల్లకీసేవ చక్కగా కొనసాగింది.