వశిష్ట గోదావరిలో వరద ఉధృతి పెరుగుతోంది. ఆచంట మండలం కోడూరు వద్ద గోదావరి నీరు మూడు అడుగులు పెరగడంతో లంక గ్రామాల ప్రజలు ఆందోళనలో ఉన్నారు. భీమలాపురం, అయోధ్యలంక, పచ్చలంక వంటి గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. పల్లపులంక ప్రాంతాల్లో వరద నీరు చేరుతోంది. గోదావరిలో వరద ఇంకా పెరుగుతుందన్న వార్త రైతులకు ఆందోళన కలిగిస్తోంది. తమలపాకు, పచ్చిమిర్చి, అరటి పంటలకు నష్టంపై భయం నెలకొంది.