పెనుగొండ కెనాల్ రోడ్డులోని వంతెనపై కాలువ వైపు రైలింగ్ ఒక భాగం గత సంవత్సరం కూలిపోయినా ఇప్పటికీ మరమ్మతులు జరగకపోవడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బస్సులు, ఆటోలకు ఎదురుచూసే వారు అప్రమత్తంగా లేకపోతే ప్రమాదం జరగవచ్చని చెబుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే రైలింగ్ మరమ్మతులు చేయాలని గురువారం ప్రజలు కోరుతున్నారు.