తణుకు నియోజకవర్గంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం ఎండతో అల్లాడిన ప్రజలకు భారీ ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షం కొంత చల్లదనాన్ని ఇచ్చింది. అయితే, ముంతా తుఫాను నష్టం నుండి తేరుకోకముందే ఈ వర్షం రైతాంగాన్ని మరింత కుదేలు చేసే అవకాశం ఉందని సమాచారం. వీధుల్లో నీరు నిలిచిపోయి డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి.