జూన్ 14న ఉదయం 6 గంటలకు పెనుగొండ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ప్రత్యేక 'యోగాంధ్ర' కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు 'యోగా సంగమ్' పోర్టల్లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలు చేసే ఈ చారిత్రాత్మక వేడుకల్లో ప్రజలు, అధికారులు పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.