భీమవరంలో బ్రీథతోన్ 2కే రన్

ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా మే 5వ తేదీన భీమవరంలో బ్రీథతోన్ 2కే రన్ నిర్వహించనున్నారు. వినాయక మల్టి స్పెషాలిటీ హాస్పిటల్, లయన్స్ క్లబ్, వాకర్స్ అసోసియేషన్, శ్రీవిజ్ఞానవేదిక సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వినాయక హాస్పిటల్ పల్మనాలజిస్ట్ డా. పూర్ణచంద్, ఎండి డా. సాగిరాజు గణపతి రాజు తెలిపారు. ఉదయం 6 గంటలకు ప్రకాశం చౌక్ నుంచి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు ఈ 2కే రన్ జరుగుతుంది. ఆస్తమాపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం.

సంబంధిత పోస్ట్