భీమవరంలో అల్లూరి తెల్లవర్ణ చిత్రపటం ఆవిష్కరణ

సాహసానికి, సంకల్పానికి అల్లూరి ఓ సందేశమని, దేశభక్తికి త్యాగానికి అల్లూరి సీతారామరాజు అందరికి ఆదర్శమని లయన్స్ క్లబ్ అధ్యక్షులు రాంబాబు అన్నారు. అల్లూరి విద్యాభ్యాసం చేసిన భీమవరం లూథరన్ హైస్కూల్లో శనివారం అల్లూరి తెల్లవర్ణ భారీ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. బీజేపీ జిల్లా కార్యదర్శి సాయి దుర్గరాజు, సిపిఎం జిల్లా కార్యదర్శి గోపాలన్, కార్యక్రమ నిర్వాహకులు రంగసాయి లు అల్లూరి సేవలను కొనియాడారు.

సంబంధిత పోస్ట్