ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ (APCNF) కార్యక్రమానికి ప్రతిష్టాత్మక "ఫుడ్ ప్లానెట్ ప్రైజ్–2026" పురస్కారం లభించింది. స్వీడన్కు చెందిన కర్ట్ బర్గ్ఫోర్స్ ఫౌండేషన్ ఈ అవార్డును పర్యావరణ పరిరక్షణ, సుస్థిర ఆహార వ్యవస్థల అభివృద్ధి, ప్రకృతి వ్యవసాయ విధానాల ప్రోత్సాహం కోసం ప్రతి ఏడాది ప్రపంచ స్థాయిలో అందజేస్తుంది. ఈ పురస్కారం రాష్ట్రానికి, రైతు సమాజానికి గర్వకారణమని ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ వై. నూకరాజు తెలిపారు. ఈ అంతర్జాతీయ గుర్తింపు ప్రకృతి వ్యవసాయం యొక్క ప్రాముఖ్యతను చాటిచెబుతోంది.