జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరం నందు మెగా కృత్రిమ చేతుల అమరిక శిబిరం సమాచారం గోడపత్రికను సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆవిష్కరించారు. విభిన్న ప్రతిభావంతుల సాధికారతకు, స్వావలంబన పెంపుకు ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ ఇంటర్నేషనల్, ఎల్‌ఎన్-4 హ్యాండ్స్ ఫౌండేషన్ సంయుక్తంగా ఆగస్టు 2, 2026న గుంటూరులో ఈ మెగా కృత్రిమ చేతుల అమరిక శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.