భీమవరంలో విద్యుత్ ఉద్యోగులపై దాడి(VIDEO)

భీమవరంలోని చేగిడిలపేటలో లో-ఓల్టేజ్ సమస్యను పరిశీలించడానికి వెళ్లిన విద్యుత్ శాఖ ఉద్యోగులు సతీశ్, ఎ.సునీతలపై స్థానికులు దాడి చేశారు. బుధవారం విధుల్లో భాగంగా అక్కడికి వెళ్లగా, వీర లక్ష్మణరావు, అతని తండ్రి కలిసి తమను దూషించి, గాయపరిచారని బాధితులు ఫిర్యాదు చేశారు. వన్‌టౌన్ సీఐ ఎ.రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్