అక్రమంగా మద్యం కలిగి ఉన్న కేసులో మరొకరిని అరెస్టు చేశామని భీమవరం అబ్కారీ శాఖ సీఐ బలరామరాజు తెలిపారు. జులై 29న బి. శ్రీనివాసు, మణికంఠేశ్వరరావును భీమవరం మండలం రాయలంలో అరెస్టు చేసి రూ. 74,430 విలువైన అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇదే కేసుకు సంబంధించి ప్రస్తుతం యానాంలో ఉంటున్న కోనసీమ జిల్లా ఐ. పోలవరం మండలం తిల్లకుప్ప గ్రామానికి చెందిన కె. వీరబాబును గురువారం అరెస్టు చేశామని చెప్పారు.