భీమవరం మెంటేవారి తోటలోని శ్రీబాల త్రిపుర సుందరి దేవి అమ్మవారికి మంగళవారం 180 కేజీలతో ఆషాఢ మాస సారే అందించారు. తోటకూర కృష్ణ, ఫణిలక్ష్మి దంపతుల సహకారంతో ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ముందుగా 108 మహిళలచే ఆలయ ప్రాంగణం నుంచి మెంటేవారి తోటలో 180 కేజీలతో ఆషాఢ మాస సారే తో ఊరేగింపు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.