గత 35 ఏళ్లుగా క్యాన్సర్‌పై అన్ని దేశాల్లో పరిశోధనలు చేసిన మహోన్నత వ్యక్తి పద్మశ్రీ డాక్టర్ ఎంఆర్ రాజు అని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, రాజ్యసభ సభ్యుడు పాక సత్యనారాయణ తెలిపారు. ఆదివారం పెద అమిరంలోని మహాత్మాగాంధీ మెమోరియల్ ట్రస్ట్‌లో నిర్వహించిన స్మృతిసభలో వారు పాల్గొన్నారు. 2013లో ఆయన పద్మశ్రీ అందుకున్నారని, అందించిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు.