భీమవరం: లక్ష పసుపు కొమ్ములతో అమ్మవారికి అలంకరణ

శ్రావణమాసం శుక్రవారం సందర్భంగా భీమవరం మెంటేవారి తోటలోని శ్రీబాల త్రిపుర సుందరి అమ్మవారికి లక్ష పసుపు కొమ్ములతో అలంకరణ చేశారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు అమ్మవారికి పంచామృతాలతో సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు, కుంకుమ పూజలు చేశారు. అనంతరం లక్ష పసుపు కొమ్ములతో పూజ చేసి ప్రత్యేక అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్