భీమవరం: ఈనెల 31న పెన్షన్లు పంపిణీ

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు, ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను జనవరి 31, శుక్రవారం నాడు లబ్ధిదారులకు అందజేయనున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఫిబ్రవరి 1 ఆదివారం కావడంతో, ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో మొత్తం 2,24,521 మందికి ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్