న్యూక్లియర్ ఫిజిక్స్ శాస్త్రవేత్త, గాంధీయవాది, మహాత్మా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ముదిండి రామకృష్ణంరాజు సేవలు ఎనలేనివని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. ఆదివారం స్మృత్యంజలి సభలో పాల్గొని మాట్లాడారు. 35 ఏళ్లుగా అన్ని దేశాలలో క్యాన్సర్ లో పరిశోదనలు చేసిన మహోన్నత వ్యక్తి అని, మహత్మా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎంతో మంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు సేవలు అందించారన్నారు.