భీమవరం మండలంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపానికి ఎంపీ నిధులు కేటాయించాలని మండల ఆర్యవైశ్య సంఘ సభ్యులు కోరారు. శనివారం రాజ్యసభ సభ్యులు సత్యనారాయణకు భీమవరంలోని వారి కార్యాలయంలో వినతిపత్రాన్ని అందించారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పి శ్రీనివాస్ మాట్లాడుతూ దిరుసుమర్రు గ్రామంలో 27 సెంట్లు స్థలంలో ఆర్యవైశ్యుల కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేయడానికి ఎంపీ నిధులు కేటాయించాలని కోరుతున్నామన్నారు. 33 గ్రామాల సభ్యులున్నారు.