మానసిక ఒత్తిడిని దూరంచేసి ప్రశాంతతనిచ్చేది ఆధ్యాత్మిక చింతన అని, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా 36వ వార్డు బైపాస్ రోడ్డులోని శ్రీషిరిడి సాయిబాబా రధ మందిరంలో గురు పౌర్ణమి మహోత్సవాలను ఎమ్మెల్యే అంజిబాబు పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. బాబావారికి పంచామృతాలతో అభిషేకాలు, లక్ష్మీ గణపతి హోమాలు నిర్వహించారు.