భీమవరం పట్టణం 37వ వార్డు లంకపేటలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి తోట సీతారామ లక్ష్మీ బుధవారం పాల్గొన్నారు. ఆమె లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లను అందించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లో సూపర్ సిక్స్ హామీల ప్రకారం అన్ని సామాజిక పెన్షన్లు పెంచారని ఆమె తెలిపారు.