పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని శ్రీసోమేశ్వర స్వామి దేవస్థానంలో, పౌర్ణమి సందర్భంగా శివలింగం భక్తులకు బుధవారం శ్వేతవర్ణంలో దర్శనమిచ్చింది. ఈ దేవాలయం యొక్క విశిష్టత ఏమిటంటే, పౌర్ణమి నాడు శివలింగం శ్వేతవర్ణంలో, అమావాస్య నాడు గోధుమ వర్ణంలో దర్శనమిస్తుంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని, ఆలయ అర్చకులు స్వామి వారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు.