రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ శనివారం భీమవరంలో మాట్లాడుతూ, అవినీతి మూలాల నుంచే పుట్టిన వైసీపీ పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో అసత్య ప్రచారాలను ఆయుధంగా చేసుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని ఆరోపించారు. తిరుమల - తిరుపతి వంటి పవిత్ర క్షేత్రాల గౌరవాన్ని భ్రష్టుపట్టించిన బాధ్యత పూర్తిగా వైసీపీదేనని, తిరుమల కల్తీ నెయ్యి అంశంలోనూ నిజాలను వక్రీకరిస్తూ ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసిందని ఆయన అన్నారు.