భీమవరంలో భారతీయ విద్యా భవన్ కేంద్రం విద్యార్థి చిర్ల శ్రీరామ్ రెడ్డి సీబీఎస్ఈ సిలబస్‌లో 500 మార్కులకు 493 (98.6%) మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచారు. ఈ సందర్భంగా మంగళవారం భీమవరంలో విద్యా భవన్లో అభినందన సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్రం చైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాధరాజు మాట్లాడుతూ శ్రీరామరెడ్డి విజయం విద్యా భవన్స్‌కు గర్వకారణమని, భవిష్యత్తులో ఉన్నత స్థానాలు సాధించాలని ఆకాంక్షించారు.