రేపు 10తరగతి ఫలితాలు... డీఈవో నారాయణ

పశ్చిమగోదావరి జిల్లా డిఇఓ నారాయణ తెలిపిన వివరాల ప్రకారం, ఏపీ ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్ష ఫలితాలు రేపు ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని, ఒకవేళ ఆశించిన ఫలితాలు రాకపోయినా నిరుత్సాహపడవద్దని ఆయన సూచించారు. తల్లిదండ్రులు పిల్లల భావాలను అర్థం చేసుకొని, వారిపై ఒత్తిడి లేకుండా ధైర్యాన్ని నింపాలని ఆయన కోరారు. ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం వేసవిలో ప్రత్యేక తరగతులు నిర్వహించి, వారందరూ ఉత్తీర్ణులయ్యేలా సహాయం అందించాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్