భీమవరం పేరులో ఉన్న ఎనర్జీ, వైబ్రేషన్‌ను బట్టి మా టీంకు 'భీమవరం బుల్స్' అని పేరు పెట్టామని క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి తెలిపారు. భీమవరం ఎస్ఆర్కెర్ కాలేజీలో జెర్సీ, లోగో ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడారు. భీమవరంలో తనకు స్నేహితులు ఎక్కువమంది ఉన్నారని, ముఖ్యంగా ఏసీఏ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తనకు అతి సన్నిహితుడని చెప్పారు. ఆగస్టు 8 నుంచి జరిగే ఏపీ సీఏల్ మ్యాచ్ లు చూడాలని కోరారు.