అర్హులైన ప్రతి ఒక్కరు ఓటర్లుగా తప్పక నమోదు చేయించాలి

గురువారం కలెక్టరేట్‌లోని వశిష్ట సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై సమీక్ష సమావేశం జరిగింది. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఖచ్చితమైన, పారదర్శకమైన ఓటర్ల జాబితా అత్యంత ముఖ్యమని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను జాగ్రత్తగా నిర్వహించాలని, అర్హులైన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు కావడం, అనర్హుల పేర్లు తొలగించడం ఈ కార్యక్రమ లక్ష్యమని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్