భీమవరం మండలం యనమదుర్రు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పూలపర్తి రామాంజనేయులు, ఆర్డీవో ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు ఎమ్మెల్యేను వరి కంకులతో సత్కరించారు. ప్రభుత్వం రైతులకు మద్దతు ధర కల్పించిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.