పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ఫోటోలతో ఉన్న పేపర్లను ఎస్ఎఫ్ఐ నాయకులు శనివారం దగ్ధం చేశారు. విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి చేసిన 'కోడిగుడ్డు, గాడిద గుడ్డు', 'స్కూల్స్ కు శోభనం పెళ్ళికొడుకుల్లా వస్తున్నారు వంటి వ్యాఖ్యలపై నిరసన తెలిపారు. ఈ వ్యాఖ్యలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్నకుమార్ డిమాండ్ చేశారు.