భీమవరంలో ఘరానా దొంగ అరెస్ట్

భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న మేకల కిషోర్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ.35 లక్షల విలువైన 207 స్మార్ట్ఫోన్లతో కూడిన రెండు ధర్మాకోల్ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. చోరీకి గురైన ఈ సెల్ ఫోన్లను పశ్చిమ బెంగాల్ తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ వివరాలను ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి శనివారం మీడియాతో వెల్లడించారు.

సంబంధిత పోస్ట్