ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి. జేసీ రాహుల్ కుమార్ రెడ్డి

గణపవరం తాసిల్దార్ కార్యాలయంలో రబి ధాన్యం సేకరణపై జేసీ రాహుల్ కుమార్ రెడ్డి అధికారులు, రైస్ మిల్లర్ల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో రబి ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. ఇప్పటివరకు 27 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తయిందని, మరో 23 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల్సి ఉందని తెలిపారు. మిగిలిన ధాన్యం సేకరణ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. రైతులకు గోనె సంచుల కొరత లేకుండా తక్షణమే 2.5 లక్షల గోనె సంచులు అందుబాటులో ఉంచాలని, పిఆర్ 126 రకాన్ని మిల్లర్లు కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్