ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసిన మహిళకు అందులో వచ్చిన దాన్ని చూసి షాక్ అయ్యింది. భీమవరం జంక్షన్ సమీపంలో వాణి అనే మహిళ టిఫిన్ ఆర్డర్ చేయగా, పార్శిల్‌లో ఆహారంతో పాటు కరెంట్ ప్లగ్ రావడం కలకలం రేపింది. వరుస ఘటనలతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. హోటళ్లలో నాణ్యత, పర్యవేక్షణ లోపంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.