వడదెబ్బతో వ్యక్తి మృతి

పాలకోడేరు (M) శృంగవృక్షం శివారు సుందరయ్యకాలనీకి చెందిన 45 ఏళ్ల వ్యవసాయ కూలీ పండ్రంకి నాగఅప్పారావు సోమవారం వడదెబ్బతో మృతి చెందారు. మధ్యాహ్నం పొలం నుంచి ఇంటికి వస్తుండగా దూసనపూడి రోడ్డులో తీవ్ర అస్వస్థతకు గురై పడిపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఎండ తీవ్రతను తట్టుకోలేక ఈ ఘటన జరిగినట్లు బంధువులు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు, దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

సంబంధిత పోస్ట్