అనసూయ చెస్ అకాడమీ, వెస్ట్ గోదావరి చెస్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో ఈనెల 20న గ్రంధి వెంకటేశ్వరరావు మెమోరియల్ ఇన్విటేషనల్ ఏపీ స్టేట్ ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు మాదాసు కిషోర్ చెప్పారు. భీమవరం తాలూకా ఆఫీసు సెంటర్లోని జీవీఆర్ కళ్యాణ మండపంలో పోటీలు జరుగుతాయన్నారు. పాల్గొనే క్రీడాకారులకు ఉచితంగా మాస్టర్ చెస్ బోర్డులు, విజేతలకు రూ. 20 వేల నగదు బహుమతులు అందిస్తామన్నారు.