రాజకీయాల్లో లంచగొండితనాన్ని అరికట్టాలని, విద్యావంతులైన యువత రాజకీయాల్లోకి రావాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బుధవారం తాడేపల్లిగూడెం ఆదికవి నన్నయ యూనివర్సిటీ క్యాంపస్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరం, మెడికల్ క్యాంపులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. లంచం లేనిదే ఏ పనీ జరగని దుస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ అశోక్, అధ్యాపకులు హీరా, విద్యార్థులు పాల్గొన్నారు.