భీమవరంలో మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని 83 మంది విద్యార్థులకు రూ. 6.70 లక్షల స్కాలర్‌షిప్ చెక్కులను ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మంగళవారం అందజేశారు. విద్య ద్వారానే పేదరిక నిర్మూలన, అభివృద్ధి సాధ్యమని, ఈ ఏడాది భారతదేశ వ్యాప్తంగా 2800 మంది విద్యార్థులకు రూ. 2.52 కోట్లు కేటాయించడం గొప్ప విశేషమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రఘువీర్ కూడా పాల్గొన్నారు.