భీమవరంలో రోడ్డు ప్రమాదానికి గురైన ఆబోతుల యాశ్వంత్ కు సంస్కార్ స్కూల్ డైరెక్టర్ నందమూరి రాజేష్, వారి మిత్ర బృందం రూ. 1.5 లక్షల ఆర్థిక సహాయాన్ని ఆదివారం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలు అనుకోకుండా జరుగుతాయని, ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలని, అతివేగం ప్రమాదకరమని సూచించారు. రంగసాయి, రాజేష్, చంద్రశేఖర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.