తణుకు వన్ స్టాప్ సెంటర్ లో ఎంపికైన సిబ్బందికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి నియమక పత్రాలను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అందించారు. మహిళలు, బాలికలు, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న బాధితులకు కీలక సేవలు అందించే కేంద్రంగా వన్ స్టాప్ సెంటర్ పనిచేస్తుందని కలెక్టర్ తెలిపారు. నియమితులైన సిబ్బంది బాధ్యతాయుతంగా, సేవాభావంతో పనిచేస్తూ మహిళలకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా మహిళల భద్రత, న్యాయసహాయం, కౌన్సెలింగ్, వైద్య సహాయం వంటి సేవలను సమర్థవంతంగా అందించడంలో తమ పాత్ర కీలకమని ఆమె పేర్కొన్నారు.