ఎన్టీఆర్ ఆత్మగౌరవ ప్రతీక: మంత్రి గొట్టిపాటి రవికుమార్

భీమవరం మున్సిపల్ కార్యాలయం వద్ద తెలుగు యువత పట్టణ అధ్యక్షులు గొలగాని రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ, తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని, బడుగు బలహీన వర్గాల్లో రాజకీయ చైతన్యం తెచ్చిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్